BREAKING NEWS
latest

కిండర్ డౌన్ వాటర్ ఫాల్స్

నీరు పల్లమెరుగు అన్నది అందరికీ తెలిసిందే...కానీ ... నీరు ఎత్తుకు ఎగురు అన్నది ఎక్కడైన విన్నారా....కానీ ఇది నిజం...ఉవ్వెత్తున నింగికెగిరే జలపాతాన్ని చూస్తుంటే జీవితంలో ఒక్కసారైనా అక్కడికి వెళ్లాలనిపిస్తుంది. ఇంతకీ ఆ రివర్స్ వాటర్ ఎక్కడుందో తెలుసా?

జీవితంలో
వాటర్ ఫాల్స్ ఎన్నో చూసి ఉంటాం...కాని ఇలాంటి రివర్స్ వాటర్ ఫాల్ బహుశా ఎప్పుడూ చూసి ఉండక పోవచ్చు.

పల్లం నుంచి ఎత్తుకు ఎగిరే ఈ జలపాతం ఇంగ్లాండ్ లోని పీక్ జిల్లాలో ఉంది. 98 ఫీట్ల ఎత్తైన కిండర్ డౌన్ ఫాల్ పీక్ డిస్ట్రిక్ట్ లోనే అత్యంత పొడవైనది.

నిజానికి నీరు పల్లమెరుగుతుంది. కానీ అక్కడ ఎత్తైన పర్వత ప్రాంతంలో బలమైన గాలులు వీచడం వల్ల వాటర్ ఫాల్ కాస్తా రివర్స్ అయింది.

నిజానికి ఈ వాటర్ ఫాల్ 80 అడుగుల కిందికి ప్రవహిస్తుంది. కానీ హరికేన్ ప్రభావం వల్ల గంటకు 50 మైళ్ల వేగంతో గాలి వాటర్ ఫాల్ పైకి వీయడంతో ఈ దృశ్యం కనువిందు చేస్తోంది.

నల్లని పర్వతాల మధ్య తెల్లని ఈ జలపాతం ఓ అద్భుతాన్ని ఆవిష్కరించింది. ప్రకృతి సౌందర్యమంటే ఇదేనేమో

« PREV
NEXT »

No comments